Telugu Global
Telangana

'ఇందిరమ్మ ఇళ్ల'కు కమిటీలు

కమిటీల కోసం పేర్లను పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశం

ఇందిరమ్మ ఇళ్లకు కమిటీలు
X

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ వార్డు స్థాయిలో ఇది ఏర్పాటవుతాయి. దీనికి సంబంధించి శుక్రవారమే ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం వరకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కమిటీలో ఎవరెవరు ఉండాలంటే?

పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. గ్రామ పంచాయతీ స్థాయి కమిటీలో సర్పంచ్‌ లేదా ప్రత్యేక అధికారి ఛైర్మగా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు, ముగ్గురు స్థానికులు సభ్యులుగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒకరు చొప్పున ఉండాలని స్పష్టం చేసింది.

మున్సిపల్‌ వార్డు స్థాయి కమిటీలో కౌన్సిలర్‌ లేదా కొర్పొరేటర్‌ ఛైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు, ముగ్గురు స్థానికులు సభ్యులుగా వ్యవహారిస్తారు. వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒకరు చొప్పున ఉండాలి.ఈ కమిటీల కోసం పేర్లను పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

First Published:  13 Oct 2024 7:07 AM IST
Next Story