నేడు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం
అటవీ అనుమతుల, రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్న రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతున్నది. నేడు ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కుమారస్వామిని కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, 5 గంటల సమయంలో పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అవుతారు. రిజినల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని అటవీ భూముల నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి అటవీశాఖకు సంబంధించి పర్యావరణ అనుమతులు కేంద్ర ఇవ్వాల్సి ఉన్నది. వీటికి సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలను వెంటనే క్లియర్ చేయాలని భూపేందర్ యాదవ్‌ను సీఎం కోరనున్నారు. రాష్ట్రంలో ఉక్క పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు, అలాగే భారీ పరిశ్రమలకు సంబంధించి కొన్ని ప్రోత్సాహాల కోసం కేంద్రం పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం కోరనున్నారు. వీటన్నింటిపై సీఎం మధ్యాహ్నాం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం రాత్రికి ఢిల్లీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రేవంత్‌రెడ్డి సింగపూర్, దుబాయ్‌లో పర్యటించనున్నారు.