Telugu Global
Telangana

సీఎం సారూ.. అపాయింట్మెంట్ అర్దర్లు ఇవ్వండి

ప్రజా భవన్ కు తరలివచ్చిన డీఎస్సీ - 2008 అభ్యర్థులు

సీఎం సారూ.. అపాయింట్మెంట్ అర్దర్లు ఇవ్వండి
X

సీఎం గారు.. తమకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డీఎస్సీ - 2008 అభ్యర్థులు వేడుకున్నారు. త‌మ‌ స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ పూర్త‌య్యి 50 రోజులు గ‌డుస్తున్నా ప్ర‌భుత్వం అపాయింట్మెంట్ ఆర్డ‌ర్లు ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల‌కు చెందిన 200 మందికిపైగా అభ్య‌ర్థులు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని ప్ర‌జా భ‌వ‌న్ కు త‌ర‌లివ‌చ్చారు. 15 ఏండ్లుగా ఎదురు చూస్తున్న త‌మ‌కు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ప్ర‌భుత్వం చొర‌వ‌తో సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలోనే త‌మ‌ స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ చేశారని తెలిపారు. రాష్ట్రంలో 1400 మంది అభ్య‌ర్థుల స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ చేశారని తెలిపారు. ఆ వెంటనే తమకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారని ఆశించామని, 50 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్న ప్రయివేటు ఉద్యోగాలు మానేశామని దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. వాళ్ల సమస్యను రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తానని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. ఆందోళనలో డీఎస్సీ-2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, కార్య‌ద‌ర్శి మెరుగు భాస్కర్, నాయకులు ప్రమీల, మహేశ్వరి, పరమేశ్వరి, జ్యోతిర్మ‌యి, భూపతి రెడ్డి, కర్ణ ప్రసాద్, ఫ‌రీద్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  19 Nov 2024 5:53 PM IST
Next Story