సెక్రటేరియట్‌కు వాస్తు మార్పులు.. రేవంత్ ప్లాన్ ఏంటి..?
రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తుకు మార్చారు. ఇప్పటికే తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఆఫీసు ఏర్పాటుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ సెక్రటేరియట్‌కు మరోసారి వాస్తు మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటివరకూ సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి కాన్వాయి లోపలకు వచ్చేది. కానీ ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలకు వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. IAS, IPS, ఇతర ఉన్నతాధికారులు.. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా రాకపోకలు సాగిస్తారని తెలుస్తోంది.
రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తుకు మార్చారు. ఇప్పటికే తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఆఫీసు ఏర్పాటుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
Breaking News:
— Telangana Awaaz (@telanganaawaaz) June 3, 2024
తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు!
ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్
ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లిపోనున్న ముఖ్యమంత్రి కాన్వాయ్
సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్,… pic.twitter.com/EhFxcpZtjm
సెక్రటేరియట్‌లోని మరికొన్ని విభాగాల్లోనూ వాస్తు విషయంలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు, సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో మరమ్మతులు చేస్తున్నారు. వెంటిలేషన్‌తో పాటు, కారిడార్లలో వర్షపు నీరు నిలవకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వాస్తు మార్పులు చేయిస్తే.. ఇదే రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్‌లో కొత్త సచివాలయాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొత్తం రూ.617 కోట్లతో ఇండో-పర్షియన్ స్టైల్‌లో 265 అడుగుల ఎత్తుతో ఈ బిల్డింగ్ నిర్మించారు. మొత్తం సచివాలయం 28 ఎకరాల్లో విస్తరించి ఉంది.