Telugu Global
Telangana

సీఎం రేవంత్ ప్రజల దృష్టిలో చిల్లరగాడిలా మిగిలిపోతారు : ఈటల రాజేందర్‌

బీజేపీ ఆఫీసుపై పథకం ప్రకారమే దాడి జరిగిందని బీజేపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

సీఎం రేవంత్ ప్రజల దృష్టిలో చిల్లరగాడిలా మిగిలిపోతారు :  ఈటల రాజేందర్‌
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చిందని దేశ చరిత్రలో ఒక పార్టీ ఇంకొక పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దాఖలు లేవని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. నాంపల్లి స్టేట్ బీజేపీ ఆఫీస్‌లో ఈటల మీడియాతో ​మాట్లాడారు. ప్లాన్ ప్రకారమే బీజేపీ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడే ఉండి చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్‌కు రాకుండా వర్చువల్‌గా పాల్గొన్నారు. కానీ చిన్న ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కి మాత్రం వెళ్లే సమయం ఉందా? మోదీతో పెట్టుకుంటే మాజీ సీఎం కేసిఆర్‌కు పట్టిన గతే పడుతుంది. మీ విధానాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. బేషరతుగా సీఎం,సీపీ బీజేపీ ఆఫీసు మీద దాడి పట్ల క్షమాపణ చెప్పాలి’అని ఈటల డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఇంత బలహీనంగా ఉందా? అనుభవం ఉన్న పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ ఉన్నారు. రేవంత్ అధికార భ్రమలో ఉన్నారు. రేవంత్.. మేము తలచుకుంటే మీరు ఉండరు. మేము దాడి చేస్తే తుక్కు తుక్కవుతారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందా! దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. రేవంత్.. ప్రధాని మోదీని చూసి పరిపక్వత తెచ్చుకో. తెలంగాణలో ప్రతి గడపలో సీఎంను చీదరించుకుంటున్నారు. హై కమాండ్ మెప్పు కోసమే ఈ చిల్లర పని.రేవంత్ ప్రజల దృష్టిలో చిల్లరగాడిలా మిగిలిపోతారు. జనరల్ గా పార్టీ ఆఫీసులో అధ్యక్షుడు ఉంటారు. నిన్న మేము పార్టీ ఆఫీస్ లో ఉంటే పరిస్థితి ఏంటి? కేంద్రాన్ని అడిగేటప్పుడు మర్యాద పాటిస్తారని ఈటల పేర్కొన్నారు.

First Published:  8 Jan 2025 8:44 PM IST
Next Story