ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆ నియోజకవర్గానికే రేవంత్!
ఒకవేళ ఈ టూర్ ఓకే అయితే ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఓ నియోజకవర్గంలో పాల్గొనబోయే మొదటి కార్యక్రమం ఇదే. ఇలా పాలకుర్తి యంగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు ఏ జిల్లా పర్యటన చేపట్టలేదు. జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనలేదు. సొంత నియోజకవర్గం కొడంగల్‌కు కూడా ఇప్పటిదాకా వెళ్లలేదు. అయితే జనవరి 3న సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి జిల్లా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొనే ఛాన్సుంది. ఈ మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తమ్మ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత ఝాన్సీ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ నియోజకవర్గంలోని తొర్రూరు మండలం గుర్తూరులో నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమిపూజకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలకుర్తి టూర్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటివరకు అధికార ప్రకటన రాలేదు. ఈ రెండుమూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఒకవేళ ఈ టూర్ ఓకే అయితే ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఓ నియోజకవర్గంలో పాల్గొనబోయే మొదటి కార్యక్రమం ఇదే. ఇలా పాలకుర్తి యంగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చర్చ జరుగుతోంది.
HJRSDC హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తామామలు కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. 74 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండబోతోంది. యువతకు 10 విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 3వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 15వేల మందికి శిక్షణ ఇప్పించడమే టార్గెట్ అని నిర్వాహకులు చెబుతున్నారు.