ఆ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన రేవంత్.. కేబినెట్‌లో నో ప్లేస్!
మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇక జూలై ఫస్ట్ వీక్‌లో కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు కేబినెట్ విస్తరణ ఉండబోతుందని సమాచారం.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే వారికి మంత్రి పదవులు ఇవ్వబోమన్నారు. కాంగ్రెస్ బీ-ఫామ్‌పై పోటీ చేసి గెలిచిన వారికి మాత్రమే కేబినెట్‌లో చోటు దక్కుతుందని స్పష్టం చేశారు.
దాదాపు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇక జూలై ఫస్ట్ వీక్‌లో కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు కేబినెట్ విస్తరణ ఉండబోతుందని సమాచారం.
మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పలువురు నేతలకు షాకిచ్చినట్లయింది. బీఆర్ఎస్ బీ-ఫామ్‌పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కనున్నాయని ప్రచారం జరిగింది. కాగా, దీనిపై పార్టీలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.