Telugu Global
Telangana

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌

ఝార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో సీఎం చర్చిస్తారని సమాచారం

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌
X

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో సమావేశమౌతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఝార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి సీఎం వెళ్లే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఇప్పటికే డిప్యూసీ సీఎం భట్టి విక్రమార్క, మహారాష్ట్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌లు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, తాజాగా ధాన్యం కొనుగోలు, మద్దతు ధర అంశాలపై రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుండటం వంటి అంశాలపై పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆరు గ్యారెంటీలనే కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నది. కానీ ఆ పథకాల్లో ఒక్కటి కూడా ఇక్కడ అమలు కావడం లేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ విమర్శిస్తున్నది.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం పార్టీ అగ్రనేతలతో భేటీ సందర్భంగా చర్చకు వస్తే హైకమాండ్‌ ఎలా స్పందిస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.

First Published:  12 Nov 2024 12:29 PM IST
Next Story