కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. ఆ సీటు హామీ ఇచ్చిన రేవంత్..?
డి.కె.అరుణకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు జితేందర్ రెడ్డి. బీజేపీ హైకమాండ్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.
మహబూబ్‌నగర్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లిన సీఎం రేవంత్.. ఆయనను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు.
మహబూబ్‌నగర్ టికెట్ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు జితేందర్ రెడ్డి. బీజేపీ హైకమాండ్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.
బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి. https://t.co/bEpsHWS5pQ pic.twitter.com/LpQchTOHyK
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2024
జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ మల్కాజ్‌గిరి అభ్యర్థిగా బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరిలో బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది కాంగ్రెస్. ఇప్పటికే బీజేపీ మల్కాజ్‌గిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ప్రకటించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది బీజేపీ. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇటీవల అమిత్ షా పర్యటనలో ఎంపీ టికెట్ విషయం గుర్తు చేయగా.. భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయని.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని జితేందర్ రెడ్డికి సూచించినట్లు సమాచారం.