Telugu Global
Telangana

హరీష్‌ రావు.. ఔరంగజేబు.. రేవంత్ చెప్పిన కథ

300 ఏళ్ల క్రితం ఔరంగజేబు ఉండేవాడని.. రాజు కావాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి, సోదరుడు ఇవ్వలేదన్నారు. దీంతో ఔరంగజేబు తండ్రిని జైలులో పెట్టి, అన్నను ఉరేసి చంపాడని చెప్పారు.

హరీష్‌ రావు.. ఔరంగజేబు.. రేవంత్ చెప్పిన కథ
X

చేతకాకపోతే సీఎం పదవికి రిజైన్ చేయాలన్న హరీష్‌ రావు కామెంట్స్‌పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌ నేతలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఉద్యోగాలు ఊడినందుకే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు రేవంత్‌.

ఇక హరీష్‌ రావును ఉద్దేశించి ఔరంగజేబు కథ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 300 ఏళ్ల క్రితం ఔరంగజేబు ఉండేవాడని.. రాజు కావాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి, సోదరుడు ఇవ్వలేదన్నారు. దీంతో ఔరంగజేబు తండ్రిని జైలులో పెట్టి, అన్నను ఉరేసి చంపాడని చెప్పారు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారుపేరుగా ఔరంగజేబు పేరు చరిత్రలో నిలిచిపోయిందన్నారు. హరీష్‌రావు కూడా మరో ఔరంగజేబు అవతారమెత్తాల్సిందేనంటూ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.


10 సంవత్సరాలు బీఆర్ఎస్‌ నేతలే అధికారంలో ఉన్నారని.. ఆర్థికమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ పనిచేశారని గుర్తుచేశారు రేవంత్. 3650 రోజులు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపేందుకు మాత్రం సమయం దొరకలేదంటూ సెటైర్లు వేశారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోయారన్నారు.

First Published:  15 Feb 2024 7:58 PM IST
Next Story