కేసీఆర్ లక్కీ నంబర్ 6.. మరి రేవంత్‌ది..?
సెక్రటేరియట్‌లో మాజీ సీఎం కేసీఆర్ చాంబర్ 6వ అంతస్తులో ఉండగా.. దానిని ఇప్పుడు 9వ అంతస్తుకు మారుస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది.
ప్రతి ఒక్కరికి ఓ లక్కీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌ను నమ్ముకుంటే లక్కు కలిసొస్తుందనే నమ్మకం. దీంతో ప్రతి విషయంలో లక్కీ నంబర్ కనెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. మొబైల్ నంబర్, కారు నంబర్ మొదలు ప్రతి విషయంలో లక్కీ నంబర్ మ్యాచ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సామాన్యులు మొదలుకొని సీఎం, పీఎంల వరకు ఈ లక్కీ నంబర్ల సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ 6 అని అందరికి తెలిసిందే. ప్రతి విషయంలో తన లక్కీ నంబర్ 6 మ్యాచ్ అయ్యేలా ఆయన చూసుకునేవారు. తాజాగా సీఎం రేవంత్ సైతం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారనే చర్చ జరుగుతోంది.
తన లక్కీ నంబర్ 9 అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అందుకు అనుగుణంగానే సెక్రటేరియట్‌లో తన చాంబర్‌ను, తాను ఉపయోగించే వాహనాల నంబర్ ప్లేట్లను మారుస్తున్నట్టు తెలుస్తోంది. సెక్రటేరియట్‌లో మాజీ సీఎం కేసీఆర్ చాంబర్ 6వ అంతస్తులో ఉండగా.. దానిని ఇప్పుడు 9వ అంతస్తుకు మారుస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఇటీవల సెక్రటేరియట్‌లోని 9వ అంతస్తును పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. తన చాంబర్ ఏర్పాటుకు ఉన్న సానుకూలతలను పరిశీలించారని అధికారులను కోరారు. ఇప్పటికే 9వ అంతస్తులోకి ఫర్నిచర్‌ను, డాక్యుమెంట్లను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం లక్కీ నంబర్ ప్రకారమే ఈ మార్పు జరుగుతోందని తెలుస్తోంది. సీఎం కాన్వాయ్‌లోని వాహనాల నంబర్ ప్లేట్లు కూడా 9తోనే ఉండేట్టు మార్పులు జరుగుతున్నాయి. దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావు లక్కీ నంబర్ కూడా తొమ్మిదే కావడం విశేషం.