కొడంగల్ అభివృద్ధిపై రేవంత్ స్పెషల్ ఫోకస్.. జీవో జారీ..!
కొడంగల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నేర్పించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
BY Telugu Global30 Dec 2023 5:51 PM IST
X
Telugu Global Updated On: 30 Dec 2023 5:51 PM IST
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ-KADA ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
కొడంగల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నేర్పించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇక గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న టైమ్‌లో ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో వైద్య, విద్య మౌలికవసతులు మెరుగుపరిచారు.
Next Story