Telugu Global
Telangana

పక్క రాష్ట్రంతో కాదు.. ప్రపంచంతోనే పోటీ

కాగ్నిజెంట్ త్వరలోనే లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి డెవలప్‌మెంట్ చేయబోతున్నామన్నారు రేవంత్.

పక్క రాష్ట్రంతో కాదు.. ప్రపంచంతోనే పోటీ
X

తెలంగాణ పోటీ పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంతో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలో ప్రభుత్వం మారడంతో పెట్టుబడులు తరలిపోతాయన్న ప్రచారం జరుగుతోందని, తన పోటీ పొరుగు రాష్ట్రంతో కాదని, ప్రపంచంతో అని చెప్పారు. హైదరాబాద్‌ లాంటి సిటీ పక్క రాష్ట్రాల్లో లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇలాంటి ఎయిర్‌పోర్టు, ORR లాంటి మౌలిక వసతులు లేవన్నారు రేవంత్.


అమెరికా, కొరియా లాంటి దేశాలు చైనా ప్లస్‌ వన్‌ దేశం కోసం చూస్తున్నాయని, దానికి సమాధానంగా హైదరాబాద్‌ సమీపంలో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్‌ సిటీలో భాగస్వామ్యం కావాలని కాగ్నిజెంట్‌ ప్రతినిధులను కోరారు. కాగ్నిజెంట్ త్వరలోనే లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి డెవలప్‌మెంట్ చేయబోతున్నామన్నారు రేవంత్. అర్బన్‌, సెమీ అర్బన్, రూరల్‌గా రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పారు. పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి.

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా సైబరాబాద్‌కు పునాది పడిందన్న రేవంత్ రెడ్డి.. వైఎస్సార్, చంద్రబాబుల కృషితో అభివృద్ధి చెందిందన్నారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజకీయ విబేధాలున్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు రేవంత్.

First Published:  14 Aug 2024 11:51 PM IST
Next Story