ఆంధ్రా నేతలను మించి.. కేసీఆర్ మోసం- రేవంత్ రెడ్డి
గతంలో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణ ఆధిపత్యం ఉండేదని.. కానీ వైఎస్సార్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారన్నారు రేవంత్. పదవులు, కమీషన్లకు లొంగిపోయి KCR జలదోపిడీకి సహకరించారని ఆరోపించారు.
కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల అప్పగింతపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్‌పై వేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం జరిగిందన్నారు.
కేసీఆర్, హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారన్నారు రేవంత్. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని.. దానికి కేసీఆర్, హరీశ్‌రావు సహకరించారన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పీజేఆర్, మర్రి శశిధర్‌రెడ్డి పోరాటం చేశారన్నారు రేవంత్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించడానికి సీఎం జగన్ ప్లాన్ వేశారని.. అందుకు కేసీఆర్ అనుమతి ఇచ్చారన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను మే 5 2022న రిలీజ్ చేశారన్నారు రేవంత్. చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టారని.. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబుకు సైతం కేసీఆర్ సహకరించారని ఆరోపించారు.
గతంలో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణ ఆధిపత్యం ఉండేదని.. కానీ వైఎస్సార్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారన్నారు రేవంత్. పదవులు, కమీషన్లకు లొంగిపోయి KCR జలదోపిడీకి సహకరించారని ఆరోపించారు. SLBC, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేదన్నారు రేవంత్. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా ఏం చేశారని ప్రశ్నించారు.