ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యే - సీఎం రేవంత్
ఆగస్టు 15 తర్వాత ఆరు గ్యారెంటీలతో పాటు రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లే.. సిద్ధిపేటకు స్వాతంత్ర్యం రాబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌కు మద్ధతుగా సిద్ధిపేటలో రోడ్‌షో నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదే రోజు రైతులను రుణవిముక్తుల్ని చేస్తామన్నారు.
ఆగస్టు 15 తర్వాత ఆరు గ్యారెంటీలతో పాటు రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌పై సిద్ధిపేట రోడ్‌షోలో స్పందించిన రేవంత్ రెడ్డి.. కాచుకోవాలంటూ హరీష్‌కు ఛాలెంజ్ చేశారు. ఆగస్టు 15 వరకే సిద్ధిపేటలో హరీష్ రావు ఆటలన్నారు.
45 ఏళ్లుగా సిద్ధిపేటను మామ, అల్లుళ్లు పట్టి పీడిస్తున్నారని ఆరోపించారు. అరుంధతి సినిమాలో బొమ్మాళి మాదిరి సిద్ధిపేట ప్రజలను పట్టిపీడిస్తున్న నేత నుంచి త్వరలోనే విముక్తి కల్పిస్తానన్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఎందుకు ఓటు వేయాలన్నారు రేవంత్ రెడ్డి. నిజాం దగ్గర ఖాసీం రజ్వి ఎలాగో హరీష్ రావు దగ్గర వెంకట్రామిరెడ్డి అలానే అన్నారు. కరీంనగర్ వ్యక్తిని తెచ్చి ఇక్కడ పోటీ చేయిస్తున్నారని.. ఆయన డిపాజిట్ గల్లంతు చేయాలన్నారు.