14 ఎంపీ సీట్లు గెలుస్తాం.. లేకపోతే - సీఎం రేవంత్ ఛాలెంజ్
బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతోనే సీట్లు ప్రకటించాయన్నారు. ఎల్లుండి సీఈసీ మీటింగ్ ఉందని, అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చన్నారు రేవంత్.
పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మీడియాతో చిట్‌చాట్ చేసిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలోని 14 స్థానాలు గెలుచుకుంటుందన్నారు. తనను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రతిపక్ష నేత లేడని, ఉంటే అసెంబ్లీకి వచ్చే వాడంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతోనే సీట్లు ప్రకటించాయన్నారు. ఎల్లుండి సీఈసీ మీటింగ్ ఉందని, అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చన్నారు రేవంత్.
తన ఫ్యామిలీ నుంచి ఎవరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయరని స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దికాలంగా రేవంత్ సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ ఎంపీలుగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజా కామెంట్స్‌తో ఫుల్‌స్టాప్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపైనా స్పందించారు రేవంత్. RS ప్రవీణ్‌కుమార్ తమకు మిత్రుడేం కాదన్నారు.
ట్యాక్స్ పేయర్స్‌కు రైతుబంధు ఎందుకని ప్రశ్నించారు రేవంత్. అసెంబ్లీలో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మేడిగడ్డపై NDSA ఇచ్చిన సూచనలు అమలు చేస్తామన్నారు. జీవో నంబర్ - 3 కోర్టు ఆదేశాల మేరకే అమలు చేస్తామన్నారు. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలపై విచారణ జరుపుతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక ఆదాయం, జీఎస్టీ ఆదాయం పెరిగిందన్నారు.