Telugu Global
Telangana

ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజ్‌లు.. రేవంత్ విజన్‌ - 2050

తమ ప్రభుత్వానిది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ తరహాలోనే మిగతా రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజ్‌లు.. రేవంత్ విజన్‌ - 2050
X

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిపై సెక్రటేరియట్‌లో భార‌త పారిశ్రామిక స‌మాఖ్య (సీఐఐ) ప్ర‌తినిధుల‌తో సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ నిర్వహించారు. మెగా మాస్టర్ ప్లాన్ - 2050 పేరుతో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజిస్తామన్నారు సీఎం. ఔటర్​ రింగ్​ రోడ్డు లోపల అర్బన్​ క్లస్టర్​, ORR, RRR మధ్య ప్రాంతం సెమీఅర్బన్ క్లస్టర్...రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ప్రాంతం రూరల్ క్లస్టర్లుగా విభజిస్తున్నట్లు చెప్పారు.

తమ ప్రభుత్వానిది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ తరహాలోనే మిగతా రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఫార్మా సిటీ స్థానంలో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లు రావాలన్నారు. రక్షణ, నావికారంగం పరికరాల తయారీపై దృష్టి పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

తెలంగాణలో దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులున్నారని.. స్కిల్ యూనివర్సిటీలతో యువతలో నైపుణ్యం పెంచాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం రేవంత్​ రెడ్డి.

First Published:  6 Jan 2024 9:04 PM IST
Next Story