Telugu Global
Telangana

మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

మంత్రి పదవిపై వివేక్‌ వెంకటస్వామి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మదన్‌ మోహన్‌ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూనంనేని సాంబశివరావు ఆశలు పెట్టుకున్నారు.

మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
X

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన మ‌రుస‌టి రోజే రేవంత్‌రెడ్డి మళ్లీ ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 11మంది మంత్రులకు శాఖల కేటాయింపు, మిగిలిన ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనేదానిపై అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఆ ఆరుగురు కొత్త మంత్రులెవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవిపై వివేక్‌ వెంకటస్వామి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మదన్‌ మోహన్‌ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూనంనేని సాంబశివరావు ఆశలు పెట్టుకున్నారు. వీరి పేర్లు మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నాయి. అద్దంకి దయాకర్, ప్రొఫెసర్‌ కోదండరాం పేర్లు కూడా వినిపించాయి. ఇక BRSనుంచి కాంగ్రెస్‌కు వలసలు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన 6 మంత్రి పదవులు కాంగ్రెస్‌ వాళ్లకే ఇస్తారా..? లేదా వలస నేతలకు ఇస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రమాణ స్వీకారం చేసిన 11మంది మంత్రుల శాఖలు ఇవే అంటూ నిన్న మ‌ధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ లిస్ట్ హల్‌చల్‌ చేస్తోంది.

భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి- హోం శాఖ‌

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్‌ శాఖ

డి.శ్రీధర్‌బాబు-ఆర్థిక శాఖ

దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ

పొన్నం ప్రభాకర్‌- బీసీ సంక్షేమ శాఖ

జూపల్లి కృష్ణారావు- పౌరసరఫరాల శాఖ

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-నీటి పారుదల శాఖ

తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ

కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

సీతక్క- గిరిజన సంక్షేమ శాఖ

11మంత్రులకు ఇవే శాఖలు గనుక కేటాయిస్తే.. కార్మిక, విద్యా, ఐటీ, మైనార్టీ, అటవీ, క్రీడా శాఖలు, టూరిజం, ఎస్సీ సంక్షేమం మిగలనున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత మంత్రిత్వ శాఖలపై స్పష్టత రానుంది.

First Published:  8 Dec 2023 2:27 PM IST
Next Story