Telugu Global
Telangana

ఆరోగ్య ఉత్సవాలకు ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు.

ఆరోగ్య ఉత్సవాలకు ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
X

కాంగ్రెస్ విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.వీటిలో 136 అంబులెన్స్‌లను 108 సర్వీసుల కోసం, 77 అంబులెన్సులను 102 సర్వీసుల కోసం ఉపయోగించనున్నారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే 33 మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ లను ప్రారంభించారు.

దీనితోపాటు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియామక ఉత్తర్వులు అందజేశారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల సంఖ్య 37కి పెరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సహ పలువురు నాయకులు పాల్గొన్నారు.

First Published:  2 Dec 2024 5:39 PM IST
Next Story