త్వరలోనే రూ.500 సిలిండర్, ఫ్రీ కరెంటు పథకాలు
దర్బార్‌లో భాగంగా ప్రత్యేకంగా మహిళలతో ముచ్చటించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు మేలు చేసే విధంగా రూ. 500 సిలిండర్ పథకాన్ని తొందర్లోనే అమలు చేస్తామన్నారు.
ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. అంతకుముందు నాగోబా జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన దర్బార్‌లో మరో రెండు హామీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు.
త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/Qy25Vsgvt2
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2024
దర్బార్‌లో భాగంగా ప్రత్యేకంగా మహిళలతో ముచ్చటించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు మేలు చేసే విధంగా రూ. 500 సిలిండర్ పథకాన్ని తొందర్లోనే అమలు చేస్తామన్నారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తామన్న రేవంత్.. ఒకేసారి లక్ష మందికి సిలిండర్లు అందిస్తామన్నారు. దీంతో మహిళలపై ఆర్థిక భారం తప్పుతుందన్నారు.
ఇక కరెంటు బిల్లులు కూడా ఎక్కువగా ఉన్నాయన్న రేవంత్ రెడ్డి.. త్వరలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీమ్‌ను ప్రారంభిస్తామన్నారు. గురువారం ఆరు గ్యారంటీల అమలుపై కేబినెట్ సబ్ కమిటీతో రివ్యూ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. వచ్చే బడ్జెట్‌లో ఈ రెండు స్కీమ్‌లకు నిధులు కేటాయించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.