కేటీఆర్‌ను ఓడించే బాధ్యత నాది.. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెండింగ్‌లో ఉన్న 9వ ప్యాకేజీని పూర్తి చేస్తామన్నారు. మేడిగడ్డ మేడిపండైందన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులను ఆదుకుంటామన్నారు రేవంత్.
వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన చీడను వదిలిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి గెలిస్తే.. సిరిసిల్ల ప్రజలకు ఇంకా మేలు జరిగేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్ధతుగా నిర్వహించిన సిరిసిల్ల జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. త్వరలోనే చేనేతల బకాయిలు చెల్లిస్తామన్నారు.
CM Revanth Reddy said that in next elections he took the responsibility to defeat KTR in Sircilla
— Naveena (@TheNaveena) May 3, 2024
He said Kaleshwaram Package9 works will be completed
He blamed BRS govt for pending dues ₹250cr to weavers and said it will be cleared after polls pic.twitter.com/KmfA5O6OOI
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెండింగ్‌లో ఉన్న 9వ ప్యాకేజీని పూర్తి చేస్తామన్నారు. మేడిగడ్డ మేడిపండైందన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులను ఆదుకుంటామన్నారు రేవంత్. ఎన్నికలు పూర్తి కాగానే అన్ని హామీలు నెరవేర్చుతామన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంటే.. కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లుగా మోడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఏ కార్యక్రమాలు చేయలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న కేసీఆర్ తమ ప్రభుత్వానికి సలహాలిస్తాడని భావించానని.. కానీ అలా జరగలేదన్నారు. అప్పుడే మా ప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారన్నారు రేవంత్. ఎంపీ సీట్లను బీజేపీకి అమ్ముకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్నారు.