హన్మకొండకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాసేపటి క్రితం హన్మకొండకు చేరుకున్నారు. కుడా గ్రౌండ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాసేపటి క్రితం హన్మకొండకు చేరుకున్నారు. కుడా గ్రౌండ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి కాలినడక కాళోజీ కళాక్షేత్రానికి వెళ్లారు. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పనులకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది.
ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో పాల్గొనేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ‘ఎక్స్’లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ చైతన్యపు రాజధాని.. కాళోజీ నుంచి పీవీ వరకు.. మహనీయులను తీర్చిదిద్దిన నేల.. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త.. జయశంకర్ సార్‌కు జన్మనిచ్చిన గడ్డ.. హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క - సారలమ్మలు నడయాడిన ప్రాంతం.. దోపిడీకి వ్యతిరేకంగా.. పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరందరి స్ఫూర్తితో.. మనందరి భవిత కోసం వరంగల్ దశ-దిశ మార్చేందుకు నేడు వస్తున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు.