కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి రామ్మోహన్ నాయుడు ఎదురొచ్చి, కౌగిలించుకుని ఆత్మీయంగా కేంద్రమంత్రి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎంపీలు కడియం కావ్యా, చామల కిరణ్ కమార్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్‌రెడ్డి పాల్గోన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా నేడు ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అదేవిధంగా తెలంగాణ పెండింగ్ అంశాలపై, విభజన హామీలపై మంత్రులతో చర్చించనున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి.