Telugu Global
Telangana

ఢిల్లీలో కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

ఢిల్లీలో కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు కిరణ్‌కుమార్, గడ్డం వంశీ, అనికుమార్ యాదవ్, బలరాంనాయక్, రఘురాం రెడ్డిలు కేంద్రమంత్రిని కలిశారు. అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అవనున్నారు. ఆ తర్వాత 7.30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అనుమతులు, నిధుల మంజూరు గురించి వీరితో సీఎం చర్చించనున్నారు.

First Published:  12 Dec 2024 6:47 PM IST
Next Story