రాజీవ్ యువ వికాస పథకన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్నిఈ స్కీమ్‌ను లాంఛనంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

తెలంగాణలో రాజీవ్ యువ వికాస పధకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్దిదారుడికి రూ.4లక్షల వరకు మంజూరు కానుంది. దీని కోసం ఏప్రిల్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.తాజాగా అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఏప్రిల్ 05 వరకు దరఖాస్తులను స్వీకరించి ఏప్రిల్ 06 నుంచి మే 30 వరకు పరిశీలన చేయనున్నారు. జూన్ 02న రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.