రేవంత్ ఫెయిల్ అవడం ఖాయం - కేటీఆర్
మల్కాజిగిరితో పాటు సికింద్రాబాద్‌లోనూ కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండకూడదని.. బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ అయ్యాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి తనకు తానే స్వయంగా ఫెయిల్ అవుతారని జోస్యం చెప్పారు. ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి రేవంత్‌కు లేదన్నారు. తెలంగాణ సంపదను పెంచే ముఖం కూడా రేవంత్‌కు లేదన్నారు కేటీఆర్.
ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టే శ్రద్ధ.. వాటర్ ట్యాప్‌ల మీద పెట్టాలని రేవంత్‌కు సూచించారు కేటీఆర్. మల్కాజిగిరిలో డమ్మీ అభ్యర్థిని పెట్టారని ఆరోపించారు. చేవెళ్ల టికెట్ కోసం పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరిందన్నారు కేటీఆర్. కానీ చేవెళ్లలో పనికిరాని చెత్తను మల్కాజిగిరిలో వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Revanth Reddy is going to Fail automatically - KTR
— Naveena (@TheNaveena) April 10, 2024
Even he knows that he is going to fail as he cannot fulfill promises made
Focus on water tapping not Phone tapping pic.twitter.com/crN3qKbX6Z
మల్కాజిగిరితో పాటు సికింద్రాబాద్‌లోనూ కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండకూడదని.. బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ అయ్యాయన్నారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ గెలిచేలా ఒప్పందం జరిగిందన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా రేవంత్ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 25-30 ఎమ్మెల్యేలతో బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతారన్నారు కేటీఆర్.