జిల్లాల పర్యటనకు రేవంత్ రెడ్డి.!
డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. జిల్లా పర్యటనలకు వెళ్లడం ఇదే తొలిసారి. ప్రమాణస్వీకారం తర్వాత పరిపాలన క్రమబద్దీకరణ, వివిధ శాఖళపై సమీక్షలు, అసెంబ్లీ సమావేశాలతో బిజిబిజీగా గడిపారు.
BY Telugu Global26 Dec 2023 11:38 AM IST

X
Telugu Global Updated On: 26 Dec 2023 12:51 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో ఆయన స్వయంగా పాల్గొంటారని అధికార వర్గాలు చెప్తున్నాయి.
డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. జిల్లా పర్యటనలకు వెళ్లడం ఇదే తొలిసారి. ప్రమాణస్వీకారం తర్వాత పరిపాలన క్రమబద్దీకరణ, వివిధ శాఖళపై సమీక్షలు, అసెంబ్లీ సమావేశాలతో బిజిబిజీగా గడిపారు. ఈనెల 24న అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతోనూ సమావేశమయ్యారు.
దాదాపు 10 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ఆయన స్వయంగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం.
Next Story