Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి కవితాత్మక ట్వీట్

ఇటీవల వైరి వర్గాలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి తన స్టైల్ మార్చారు. కవితాత్మక ట్వీట్ వేశారు.

రేవంత్ రెడ్డి కవితాత్మక ట్వీట్
X

ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లు కానీ మాటలు కానీ చాలా ఘాటుగా ఉన్నాయి. వైరి వర్గాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారాయన. అలాంటి సీఎం ఇప్పుడు ఓ కవితాత్మక ట్వీట్ వేశారు. తాను సామాన్యుడి మనిషిని అని చెప్పారు. అదే సమయంలో తాను సకల జన హితుడిని అని పేర్కొన్నారు.

ఇంతకీ రేవంత్ ట్వీట్ ఏంటంటే..?

"నేను…

చేరలేని దూరం కాదు…

దొరకనంత దుర్గం కాదు…

సామాన్యుడు మనిషిని నేను…

సకల జన హితుడను నేను." అంటూ ట్వీట్ వేశారు రేవంత్ రెడ్డి. తన వ్యక్తిగత ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేస్తూ ఈ ట్వీట్ జత చేశారు.


వివిధ కులసంఘాల ప్రతినిధులు, జీవో 317 బాధిత ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భాన్ని కూడా తన ట్వీట్ లో ప్రస్తావించారాయన. మహబూబ్ నగర్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగి దయాకర్, సీఎం రేవంత్ రెడ్డిని కలసి ఆయనకు బొకే అందించారు. జీవో 317 వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జీవో 317 ఇబ్బందులను పరిష్కరిస్తానని సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. ఈ వీడియోను షేర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కవితాత్మక పోస్ట్ చేశారు.

వీహెచ్ కు కౌంటర్ ఇచ్చినట్టేనా..?

ఇటీవల వి.హనుమంతరావు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్యకర్తల బాధలు పట్టించుకోవడంలేదన్నారు. సీఎంను తాను కలవాలన్నా వీలు కావట్లేదని, కాస్త ఈవైపు కూడా చూడాలని సెటైర్లు పేల్చారు. ఈ క్రమంలో తాను ఎవరికీ దూరంలేనని రేవంత్ రెడ్డి ట్వీట్ వేయడం విశేషం. తాను సామాన్యుడి మనిషినని, సకల జన హితుడిని అంటూ చెప్పుకొచ్చారు.

First Published:  24 March 2024 2:04 AM GMT
Next Story