Telugu Global
Telangana

మున్సిపల్ శాఖ నా దగ్గరే.. ఎందుకంటే - రేవంత్ రెడ్డి క్లారిటీ

ఇక ఇది ఓల్డ్ సిటీ కాదని.. ఒరిజినల్ హైదరాబాద్ అంటూ చెప్పుకొచ్చారు. ఒరిజినల్ సిటీని డెవలప్‌ చేసేందుకు కృషి చేస్తామన్నారు.

మున్సిపల్ శాఖ నా దగ్గరే.. ఎందుకంటే - రేవంత్ రెడ్డి క్లారిటీ
X

మున్సిపల్ శాఖను తన దగ్గరే ఉంచుకున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు గల కారణాలను కూడా వివరించారు. పాతబస్తీలో మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన రేవంత్‌.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్. ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. అందుకే మున్సిపల్ మంత్రిత్వ శాఖను తన దగ్గరే ఉంచుకున్నట్లు చెప్పారు. చంచల్‌గూడ జైలును తరలించి స్కూల్, కాలేజీ నిర్మిస్తామని చెప్పారు.


ఇక ఇది ఓల్డ్ సిటీ కాదని.. ఒరిజినల్ హైదరాబాద్ అంటూ చెప్పుకొచ్చారు. ఒరిజినల్ సిటీని డెవలప్‌ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఓవైసీపీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా మెట్రో విస్తరిస్తామని చెప్పారు. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ కూడా వస్తుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందన్నారు. గండిపేట నుంచి సిటీలో 55 కిలోమీటర్లు మూసీ నదిని సుందరీకరిస్తామన్నారు. MIMతో కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  9 March 2024 8:53 AM IST
Next Story