Telugu Global
Telangana

గేట్స్‌ ఓపెన్ చేశా.. రాజకీయం అంటే ఏంటో చూపిస్తా - రేవంత్ రెడ్డి

ఎన్నికలు సమీపిస్తుండడంతో పీసీసీ అధ్యక్షుడిగా తానేంటో చూపిస్తానన్నారు రేవంత్. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా చూడాలన్నారు.

గేట్స్‌ ఓపెన్ చేశా.. రాజకీయం అంటే ఏంటో చూపిస్తా - రేవంత్ రెడ్డి
X

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా పార్టీ గేట్లు తెరిచానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యే ఇవాళ పార్టీలో చేరారని చెప్పారు. అవతల ఖాళీ అయిన రోజు ఆటోమేటిక్‌గా గేట్లు క్లోజ్ అవుతాయన్నారు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మీట్‌ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్తున్నారని, వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించలేదని చెప్పారు. ఇవాల్టి నుంచి రాజకీయం ప్రారంభిస్తానన్నారు రేవంత్. ఎన్నికలు సమీపిస్తుండడంతో పీసీసీ అధ్యక్షుడిగా తానేంటో చూపిస్తానన్నారు రేవంత్. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా చూడాలన్నారు.

ఆర్.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ బీఆర్ఎస్‌లో చేరతారన్న వ్యాఖ్యలపైనా స్పందించారు రేవంత్. తనకు RSP మంచి మిత్రుడన్నారు. బలహీనవర్గాల పట్ల ప్రవీణ్‌కుమార్‌కు నిబద్ధత ఉందని చెప్పారు. TSPSC ఛైర్మన్‌గా చేయాలని RSPకి ఆఫర్‌ చేశానని, కానీ ఆయనే తిరస్కరించారని చెప్పారు రేవంత్. ప్రవీణ్ కుమార్‌ బీఆర్ఎస్‌లో చేరడంపై తానేమి మాట్లాడనన్నారు.

First Published:  17 March 2024 4:35 PM IST
Next Story