పోటీ పరీక్షల వాయిదాపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పరీక్షల వాయిదాపై స్పష్టత ఇచ్చారు. నిరాహార దీక్షలపై సెటైర్లు పేల్చారు.
తెలంగాణలో పోటీ పరీక్షలు వాయిదా పడే ఛాన్సే లేదని ఇది వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ సమస్యలుంటే ప్రభుత్వంతో మాట్లాడాలని, ప్రతిపక్షాల మాయలో పడొద్దని పొన్నం.. అభ్యర్థులు, విద్యార్థులకు సూచించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పరీక్షల వాయిదాపై స్పష్టత ఇచ్చారు. నిరాహార దీక్షలపై సెటైర్లు పేల్చారు.
ముగ్గురు దీక్ష చేస్తే.. దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2024
కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నాడు..
నేను ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే.. ఆయనకి కోచింగ్ సెంటర్ ఉంది రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్లు లాభం వస్తుంది అని… pic.twitter.com/nzDmH68Mki
దీక్షలపై సెటైర్లు..
పోటీ పరీక్షలకోసం నిరాహార దీక్షలు చేసేవారిపై సెటైర్లు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. పరీక్షలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దీక్షలు చేస్తే, అందులో ఒక్కరు కూడా పరీక్ష రాయట్లేదని, కనీసం దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు. పరీక్ష వాయిదా కోసం కోచింగ్ సెంటర్ యజమాని ఎక్కడైనా ఆమరణ దీక్ష చేస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.
2 నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ అయితే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడికి 100 కోట్ల రూపాయలు లాభం వస్తుందని, అందుకే ఆయన దీక్ష చేస్తున్నట్టు తెలిసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి వరకూ తన పార్టీలోనే ఉన్న మరో వ్యక్తి కూడా దీక్ష చేశాడని, పార్టీలో ఉద్యోగం ఇవ్వలేదని తనను గిల్లడానికి ఆయన దీక్షకు కూర్చున్నాడని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న యువకుడికి స్పెషల్ కోచింగ్ ఇచ్చేందుకు తాను సిద్ధపడ్డానని, ఎంక్వయిరీ చేస్తే అతడు కూడా పరీక్షలు రాయట్లేదని తేలిందని, ఎవరో లీడర్ చెప్పారని దీక్ష చేస్తున్నాడని తెలిసిందని అన్నారు. పరీక్షల వాయిదా కోసం నిరాహార దీక్షలు చేస్తున్నవారెవరూ అభ్యర్థులు కాదని తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి వారికోసం పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.