Telugu Global
Telangana

సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ : కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని దేవర ఈవెంట్ విషయంలో భద్రతను ఎందుకు కట్టుదిట్టం చేయలేకపోయారని కేటీఆర్ ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ : కేటీఆర్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రీ రిలీజ్ రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ అన్నారు. జూ ఎన్టీఆర్ సినిమా పంక్షన్‌కు కనీస సౌకర్యలు కల్పించలేకపోకవడం దారుమని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూవీ ఈవెంట్‌లు చాలా హ్యాపీగా జరుపుకునే వాళ్ళున్నారు. సినిమా పంక్షన్‌లోతో పాటు అన్ని మతాల పండుగులను సక్సెఫుల్‌గా నిర్వహించామని ఆయన అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్నారు. దేవర విషయంలో రేవంత్ రెడ్డి భద్రతను ఎందుకు కట్టుదిట్టం చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండటంతో దేవరకు కేటాయించిన పోలీసులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కోసం వెళ్లాల్సి వచ్చింది.

దీంతో పోలీసులు లేక దేవర ప్రీ రిలీజ్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు.అయితే పోలీసులు వచ్చేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో హోటల్ ఫర్నీచర్‌ని అభిమానులు ధ్వంసం చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 22న నోవాటెల్ హోటల్ లో అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. ఈ ఈవెంట్ కి శ్రేయాస్ మీడియా అంతా సిద్ధం చేసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తాకిడి ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ చేయలేక ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు

First Published:  25 Sept 2024 3:09 PM IST
Next Story