Telugu Global
Telangana

సిరాజ్‌కు బంపరాఫర్‌.. ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం

సిరాజ్‌పై వరాలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సిరాజ్‌కు బంపరాఫర్‌.. ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం
X

హైదరాబాద్‌ లోకల్‌ బాయ్‌, టీ-20 ప్రపంచకప్‌ విజేత మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. టీ-20 వరల్డ్‌కప్‌లో గెలుపు తర్వాత మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్‌.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీ-20 ప్రపంచకప్‌ గెలుపులో భాగమైనందుకు సిరాజ్‌ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.

సిరాజ్‌పై వరాలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంకు టీమిండియా జెర్సీని బహుకరించారు సిరాజ్‌. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం భవిష్యత్తులో మరిన్ని విజయాల్లో సిరాజ్ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.

ఇప్పటికే బీసీసీఐ టీమిండియాకు రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సిరాజ్‌కు రూ.5 కోట్లు దక్కనున్నాయి. ఇటీవలి టీ-20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మూడు మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన సిరాజ్‌.. ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

First Published:  9 July 2024 6:04 PM IST
Next Story