జార్ఖండ్‌కు సీఎం రేవంత్.. ఎందుకంటే..?
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దు అయింది. మరోవైపు జార్ఖండ్‌లో ఇవాళ JMM, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనుంది.
BY Telugu Global5 Feb 2024 11:25 AM IST
X
Telugu Global Updated On: 5 Feb 2024 11:36 AM IST
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో జార్ఖండ్ రాజధాని రాంచీకి బయల్దేరి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌కు చేరుకుంది. ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దు అయింది. మరోవైపు జార్ఖండ్‌లో ఇవాళ JMM, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడంతో కొత్త సీఎంగా చంపాయీ సోరెన్ బాధ్యతలు తీసుకున్నారు.
Next Story