Telugu Global
Telangana

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సీఎం భేటీ

రాష్ట్రంలో కొత్తగా ఇవ్వనున్న రేషన్‌ కార్డులు, ధాన్యంసేకరణ వంటి విషయాలపై మంత్రితో సుమారు అరగంటపాటు చర్చించిన సీఎం, మంత్రి ఉత్తమ్‌

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సీఎం భేటీ
X

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఇవ్వనున్న రేషన్‌ కార్డులు, ధాన్యంసేకరణ వంటి విషయాలపై మంత్రితో సుమారు అరగంటపాటు చర్చించారు. కేంద్రమంత్రికి అత్యవసర సమావేశం ఉండటంతో సమావేశం మధ్యలో ఆగిపోయింది. మధ్యాహ్నం 3.30 గంటలకు మరోసారి సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషితో భేటీ కానున్నారు. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద సరఫరా చేసిన బియ్యం బకాయలను విడుదల చేయాలని, అలాగే సీఎంఆర్‌ డెలివరీ పొడిగించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో సీఎం సమావేశం కానున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన,, మెట్రో రైల్‌ ఫేజ్‌-2, రిజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకలు నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు.నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అయి రాష్ట్రంలోని ప్రాజెక్టులపైనా చర్చించారు.

First Published:  4 March 2025 1:20 PM IST
Next Story