జూపల్లి నోట సీఎం కేటీఆర్..రేవంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో?
మంత్రి జూపల్లి పదవి ఊడటం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు

మంత్రి జుపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఓ మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే మంత్రి జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారని సెటైరికల్ పోస్టు చేశారు. తనను ముఖ్యమంత్రి అనడంపై కేటీఆర్ స్పందిస్తూ.. నా మాటలు గుర్తు పెట్టుకోండి జూపల్లి గారూ.. మీరు చేసిన ఈ తప్పుకు త్వరలోనే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయం అంటూ తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ వేదికగా సదరు వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
అనుకోకుండా వచ్చిన ఆ మాటలపై కాంగ్రెస్ అధిష్టానం నిజంగానే సీరియస్ గా తీసుకుంటుందా.. లేక చూసి చూడనట్టు వదిలేస్తుందా అనేది చూడాలి మరి. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేస్తోంది అంటూ.. వాటికోసం నెలకు రూ.6500 కోట్లు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి.. ముఖ్యమంత్రి కేటీఆర్ అని నోరు జారారు. ఆ తర్వాత దానిని సవరిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి అని పలికారు. కాగా జూపల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి