ఇవాళ మేడ్చల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఆ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
BY Telugu Global17 Aug 2022 4:28 AM GMT
X
Telugu Global Updated On: 17 Aug 2022 4:28 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. కేసీఆర్ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 2.55 గంటలకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అంతాయిపల్లికి చేరుకుంటారు. అక్కడ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. 30 ఎకరాల్లో 56కోట్ల 20లక్షల రూపాయలతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించగా.. సీఎం కేసీఆర్ పర్యటనకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు అంతాయిపల్లి నుంచి ఐడీఓసీ పరేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3.55 గంటలకు జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనున్నారు. సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.40 గంటలకు తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకుంటారు.
Next Story