Telugu Global
Telangana

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పని తీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
X

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియకు కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పని తీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ప్రతీ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కమిటీలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉండనున్నారు. ఈ కమిటీకి రాష్ట్ర స్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్‌వోడి స్థాయి అధికారి పరిశీలకుడిగా ఉంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

జిల్లా కమిటీల ద్వారా పంపించిన ప్రతిపాదనను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీ పూర్తి నివేదికను చీఫ్ సెక్రటరీకి పంపిస్తారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయితీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియ, తర్వాత దశలో క్రమబద్దీకరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ సర్సింగరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

First Published:  22 May 2023 7:44 PM IST
Next Story