Telugu Global
Telangana

నేడు కుల వృత్తులకు ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

నన్పూర్ మండల కేంద్రంలో రూ.55.20 కోట్లతో 26.24 ఎకరాల్లో రెండస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఛాంబర్లతో పాటు వెయిటింగ్ హాల్, మీటింగ్ హాల్ ఉన్నాయి.

నేడు కుల వృత్తులకు ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి రూ.1 లక్ష సాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, గృహ లక్ష్మి పథకాలను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. అంతే కాకుండా నన్పూర్ మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్, చెన్నూరు లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్, మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల, బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించనున్నారు.

నన్పూర్ మండల కేంద్రంలో రూ.55.20 కోట్లతో 26.24 ఎకరాల్లో రెండస్తుల భారీ భవనాన్ని నిర్మించారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఛాంబర్లతో పాటు వెయిటింగ్ హాల్, మీటింగ్ హాల్ ఉన్నాయి. స్టేట్ ఛాంబర్, స్టాఫ్ రూమ్స్ మొదటి అంతస్తులో ఉన్నాయి. ప్రతీ ఫ్లోర్‌లో 40 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న సమావేశ మందిరాలు ఉన్నాయి. టైప్-ఏ, టైప్-బి హాల్స్, ప్యాంట్రీ రూమ్, స్ట్రాంగ్ రూమ్, క్రెచ్, టాయిలెట్స్, రెండు వీఐపీ టాయిలెట్స్, నాలుగు లిఫ్టులు, ఒక హెలీప్యాడ్ నిర్మించారు. ఇక మంచిర్యాలకు సీఎం వస్తుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరిఖని, చెన్నూరు నుంచి మంచిర్యాల పట్టణంలోకి వచ్చే వాహనాలు ఉదయం నుంచి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద 363 జాతీయ రహదారిపైకి వెళ్లాలని సూచించారు.

సీఎం కేసీఆర్ నేటి షెడ్యూల్

- హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా సాయంత్రం 5.00 గంటలకు మంచిర్యాల చేరుకుంటారు.

- సాయంత్రం 5.10 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయం ప్రారంభిస్తారు.

- సాయంత్రం 5.15కు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బయలుదేరి 5.30 గంటలకు కలెక్టరేట్ భవనం వద్దకు చేరకుంటారు. అక్కడ జరిగే ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

- సాయంత్రం 6.30 గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు.

- సభలో సంక్షేమ పథకాలు లాంఛనంగా ప్రారంభిస్తారు.

- రాత్రి 7.30 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ తిరిగి వెళ్తారు.

First Published:  9 Jun 2023 8:18 AM IST
Next Story