బీడు భూములకు కృష్ణమ్మ.. నేడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం
ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు.
దక్షిణ తెలంగాణకు జీవనాడిలాంటి పాలమూరు ఎత్తిపోతలను ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటలకు పైలాన్ ఆవిష్కరించి.. నార్లాపూర్ ఇంటెక్‌వెల్ దగ్గర 145 మెగావాట్ల కెపాసిటీ ఉన్న మోటార్లను ఆన్ చేసి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొల్లాపూర్ శివారులో లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లా రైతుల దశాబ్ధాల కల నెరవేరనుంది.
ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కాళేశ్వరం రికార్డును బ్రేక్ చేసేలా 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 9 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. 915 కిలోమీటర్ల ప్రాథమిక కాల్వను నిర్మించారు. రోజుకు 3,200 క్యూసెక్కులు ఎత్తిపోయగల కెపాసిటీ ఉన్న ఈ పంపు ద్వారా రెండు టీఎంసీల నీటిని అంజనగిరి (నార్లాపూర్) జలాశయానికి తరలించి నిల్వ చేస్తారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు 1200 గ్రామాలకు తాగునీరందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశ్రమలకు 0.33 టీఎంసీల నీటిని వినియోగిస్తారు.