Telugu Global
Telangana

జూపల్లి కృష్ణారావు ఎందుకు ఓడిపోయాడో చెప్పిన సీఎం కేసీఆర్

గత ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. గతంలో ఆయనను మంత్రిగా కూడా చేసుకున్నాము. కానీ, అతను చేసిన చిన్న పొరపాటు కారణంగా ఓడిపోవల్సి వచ్చిందని అన్నారు.

జూపల్లి కృష్ణారావు ఎందుకు ఓడిపోయాడో చెప్పిన సీఎం కేసీఆర్
X

జూపల్లి కృష్ణారావు ఎందుకు ఓడిపోయాడో చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలవబోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అభ్యర్థులతో మాట్లాడారు. పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రతీ అభ్యర్థి జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు, కారకర్తలు అలగడం సహజమే. వారిని బుజ్జగించే ప్రయత్నం చేయాల్సింది అభ్యర్థులే అని కేసీఆర్ చెప్పారు. నాయకులు అన్నాక అలగడం సహజం. అలాగని వారిని వదిలేయకూడదు.. ఎంత చిన్న వ్యక్తి అయినా స్వయంగా వారి దగ్గరకు వెళ్లి.. నేనున్నాననే భరోసా ఇవ్వాలని అభ్యర్థులకు సూచించారు.

గత ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. గతంలో ఆయనను మంత్రిగా కూడా చేసుకున్నాము. కానీ, అతను చేసిన చిన్న పొరపాటు కారణంగా ఓడిపోవల్సి వచ్చిందని అన్నారు. అక్కడ ఒక నాయకుడు అలకబూనారు. విషయం నాకు తెలిసి జూపల్లిని వెళ్లి బుజ్జగించమని కోరాను. కానీ 300 ఓట్లు ఉన్న ఆ నాయకుడిని నేను బుజ్జగించడం ఏంటని జూపల్లి మాట్లాడలేదు. దీంతో కొల్లాపూర్‌లో ఓడిపోవలసి వచ్చింది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఉదాసీనంగా ఉండొద్దని అభ్యర్థులను సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

గత ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయిన పలువురిపై కేసులు పెట్టారు. వాళ్లు చేసిన చిన్న పొరపాట్ల కారణంగా కోర్టులు వారిపై అనర్హత వేటు వేశాయి. కాబట్టి బీఫామ్స్ నింపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నామినేషన్ల చివరి రోజు ఆదరాబాదరాగా నింప వద్దని.. ఇప్పటి నుంచే నామినేషన్లు తయారు చేసి పెట్టుకోవాలని అన్నారు. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా మన లీగల్ టీమ్‌ను సంప్రదించాలని, కానీ పొరపాట్లు మాత్రం చేయవద్దని హెచ్చరించారు. ఇవ్వాళ ఒక 50 బీఫామ్స్ ఇస్తున్నామని.. రేపు, ఎల్లుండి మిగిలినవి పంపిణీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  15 Oct 2023 12:36 PM IST
Next Story