Telugu Global
Telangana

ఈ రోజు యాదాద్రి థర్మల్‌ ప్లాంట్ నిర్మాణ పనులు పరిశీలించనున్న కేసీఆర్‌

2023 సెప్టెంబరులో మొదటి యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (టీఎస్‌ జెన్‌కో) అధికారులు తెలిపారు. రెండో యూనిట్‌ను అదే ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని, మిగిలిన రెండు యూనిట్లను 2024లో ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఈ రోజు యాదాద్రి థర్మల్‌ ప్లాంట్ నిర్మాణ పనులు  పరిశీలించనున్న కేసీఆర్‌
X

2023 సెప్టెంబరులో మొదటి యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (టీఎస్‌ జెన్‌కో) అధికారులు తెలిపారు. రెండో యూనిట్‌ను అదే ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని, మిగిలిన రెండు యూనిట్లను 2024లో ప్రారంభించాలని భావిస్తున్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను ఈ రోజు (సోమవారం) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది.

4,000 మెగావాట్ల పవర్ స్టేషన్, ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ ప్లాంట్, యాదాద్రిజిల్లా లోని దామరచర్ల మండలంలో రూ.29,992 కోట్ల అంచనా వ్యయంతో రాబోతోంది. ప్రాజెక్టు ప్రారంభమైతే ఇకపై తెలంగాణకు విద్యుత్ లోటు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణానికి కాంట్రాక్టును పొందింది, ఇందులో ఒక్కొక్కటి 800 మెగావాట్ల ఐదు యూనిట్లు ఉంటాయి.

2023 సెప్టెంబరులో మొదటి యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (టీఎస్‌ జెన్‌కో) అధికారులు తెలిపారు. రెండో యూనిట్‌ను అదే ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని, మిగిలిన రెండు యూనిట్లను 2024లో ప్రారంభించాలని భావిస్తున్నారు.

ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని జెన్‌కో అధికారులు తెలిపారు. ఇప్పటికే 62 శాతం పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన మూడో థర్మల్ పవర్ ప్లాంట్ ఇది. జెన్‌కో రికార్డు స్థాయిలో 46 నెలల్లో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగూడెం థర్మల్‌ ప్లాంట్‌ను నెలకొల్పింది. ఈ ప్రాజెక్ట్ 2019లో ప్రారంభించబడింది. తదనంతరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బయ్యారం సమీపంలో 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు దామెరచర్ల థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది.

First Published:  28 Nov 2022 5:30 AM IST
Next Story