Telugu Global
Telangana

మూసీ మురికినీళ్లు తాగించారు కాంగ్రెసోళ్లు..

సూర్యాపేట మ‌రింత బాగుప‌డాలంటే దరిద్ర కాంగ్రెస్‌ ను గంగ‌లో పారేయాలన్నారు సీఎం కేసీఆర్. 12కు 12 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. ఈసారి కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ వ‌చ్చేది లేదు మ‌న్ను లేదన్నారు.

మూసీ మురికినీళ్లు తాగించారు కాంగ్రెసోళ్లు..
X

సూర్యాపేట ప‌ట్టణానికి హైద‌రాబాద్ మోరీల నీళ్లు తాగునీరుగా ఇచ్చారని, ద‌శాబ్దాల త‌ర‌బ‌డి మూసీ మురికి నీళ్లు ఇచ్చారని.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకంటే ఇంకేం జరిగిందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. మునుగోడు, దేవ‌ర‌కొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగించి, లక్షన్నరమంది బ‌తుకుల‌ను క‌రాబ్ చేశారన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఈ ప్రాంతానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో బ్ర‌హ్మాండంగా పాలేరు నుంచి పాల‌లాంటి నీళ్లు వ‌స్తున్నాయని వివరించారు. నాగార్జున సాగ‌ర్ కింద టెయిల్ పాండ్ నుంచి మంచి నీళ్లు వ‌స్తున్నాయన్నారు. మంచినీళ్లు కూడా ఇయ్యడం చేత‌కాని కాంగ్రెస్ నాయ‌కులు అడ్డం పొడ‌వు మాట్లాడుతున్నారని అన్నారు కేసీఆర్.


కాంగ్రెస్ గెలిస్తే రోడ్డుమీద పండబెట్టి తొక్కుతామంటూ ఆ పార్టీ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. ఈ అహంకార నాయ‌కులు, ఈ డ‌బ్బు మ‌దం ఉన్నోళ్లు వీళ్లేనా.. న‌ల్ల‌గొండ నాయ‌కులు..? అని ప్రశ్నించారు. ఇది ఎర్ర జెండాలు ఎగిరిన గ‌డ్డ‌.. క‌మ్యూనిస్టు ఉద్య‌మాలు న‌డిచిన గ‌డ్డ‌, భీంరెడ్డి న‌ర్సింహారెడ్డి లాంటి మ‌హానీయులు ప‌ని చేసిన గ‌డ్డ‌ అని అన్నారు. ఈ గ‌డ్డ మీద ఈ దుర్మార్గుల ఆగ‌డాలు ఏంటని ప్రశ్నించారు. ఎంత‌కాలం వీళ్ల రాజ్యం సాగుతుందన్నారు కేసీఆర్.

సూర్యాపేట మ‌రింత బాగుప‌డాలంటే దరిద్ర కాంగ్రెస్‌ ను గంగ‌లో పారేయాలన్నారు సీఎం కేసీఆర్. 12కు 12 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. ఈసారి కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ వ‌చ్చేది లేదు మ‌న్ను లేదన్నారు. 70 నియోజ‌క‌వ‌ర్గాలు తిరిగి తానీ మాట చెబుతున్నానన్నారు కేసీఆర్. నూటికి నూరుశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, జ‌గ‌దీష్ రెడ్డి మంచి స్థానంలోనే ఉంటారని చెప్పారు.

First Published:  21 Nov 2023 7:40 PM IST
Next Story