Telugu Global
Telangana

కాంగ్రెస్‌ పాలనలో కాలని మోటర్‌ లేదు, ఎండని పొలం లేదు

అభివృద్ధి చేయకపోగా, కనీసం అభివృద్ధికి సహకరించడంలేదని ప్రతిపక్షాలపై మండిపడ్డారు కేసీఆర్. ఎత్తిపోతల పథకాలపై కేసులు పెట్టారని, కుట్రలు చేశారని, కానీ వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ పాలనలో కాలని మోటర్‌ లేదు, ఎండని పొలం లేదు
X

కాంగ్రెస్‌ పాలనలో కాలని విద్యుత్ మోటర్ లేదని, ఎండని రైతు పొలం లేదని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. మళ్లీ అలాంటి రాజ్యం కావాలా అని నారాయణ పేట బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రశ్నించారు. తెలంగాణను అసలు మునగగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారాయన. గత పాలనలో ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నా ఏం చేయలేదని గుర్తు చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు కేసీఆర్.


కాంగ్రెస్‌, బీజేపీ నేతలు జీవితంలో ఎప్పుడైనా జై తెలంగాణ అని అన్నారా..? అన ప్రశ్నించారు సీఎం కేసీఆర్. వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే నోర్లు మూసేశారని గుర్తు చేశారు. జై తెలంగాణ అననివారు, ఉద్యమంలో పాల్గొననివారు ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పిడికెడు మందితో బయలుదేరి తెలంగాణ అంతా తిరిగి ప్రజలను చైతన్యం చేశామని చెప్పారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా కుటిల రాజకీయాలు చేసిందని, ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకుందని విమర్శించారు కేసీఆర్.

అభివృద్ధి చేయకపోగా, కనీసం అభివృద్ధికి సహకరించడంలేదని ప్రతిపక్షాలపై మండిపడ్డారు కేసీఆర్. ఎత్తిపోతల పథకాలపై కేసులు పెట్టారని, కుట్రలు చేశారని, కానీ వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దేవుడి దయతో ఎన్విరాన్మెంట్‌ క్లియరెన్స్‌ వచ్చిందని, లిఫ్ట్‌ పని కంప్లీట్‌ అయిందని చెప్పారు. నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ కు నీరు వచ్చేలా కాలువను మంజూరు చేశామని చెప్పారు కేసీఆర్. ఒక సంవత్సరం కాలంలోపే కాలువను తీసుకువచ్చి బ్రహ్మాండంగా చేస్తానన్నారు. నారాయణపేట మొత్తం పచ్చనిపంట పొలాలు చూడాలని అనుకుంటున్నానని చెప్పారు. రింగ్‌ రోడ్డు వస్తే హైదరాబాద్‌ లాగా అవుతుందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అంటున్నారని, ఆయన కోరిక కచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు కేసీఆర్.

First Published:  6 Nov 2023 11:01 PM IST
Next Story