Telugu Global
Telangana

పాలమూరుకి ఆ గతి పట్టించిందెవరు..?

దేవరకద్ర సభ దాదాపు 5 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం తక్కువగా ఉండటంతో.. కేవలం 12 నిమిషాల్లోనే సీఎం తన ప్రసంగాన్ని ముగించి అక్కడి నుంచి బయలుదేరారు.

పాలమూరుకి ఆ గతి పట్టించిందెవరు..?
X

పాలమూరు జిల్లా ఒకప్పుడు పాలుకారిన జిల్లా అని, అద్భుతమైన జిల్లా అని.. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాను ఎవరూ పట్టించుకున్నపాపాన పోలేదని చెప్పారు సీఎం కేసీఆర్. చివరకు ఇక్కడ గంజి కేంద్రాలు పెట్టే పరిస్థితికి తెచ్చారని, ఆ గతి పట్టించిన కాంగ్రెస్ ని ఏం చేద్దామని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాకే జిల్లా పరిస్థితి మారిందని గుర్తు చేశారు కేసీఆర్.


తెలంగాణ ఊరికే రాలేదని మొండి పట్టుదలతో పోరాటం చేస్తే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు కేసీఆర్. దేశవ్యాప్తంగా 33 పార్టీల మద్దతు కూడగట్టామని, 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆయన ఎప్పుడూ తన దగ్గర వ్యక్తిగత కోర్కెలు కోరలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన ప్రయత్నించారని చెప్పారు.

ఆలోచించాలి..

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు సీఎం కేసీఆర్. ఆపద మొక్కులు మొక్కేవారిని చూసి మోసపోవద్దన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు, తెలంగాణ సాధించి అభివృద్ధి చేసి చూపించింది ఎవరో గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకి అని చెప్పారు కేసీఆర్. పాలమూరు జిల్లా అభివృద్ధికి, ప్రాజెక్ట్ ల ఏర్పాటుకి స్థానిక మంత్రులు కంకణం కట్టుకున్నారని, వారి కృషి వల్లే ఇప్పుడు జిల్లా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేవరకద్ర సభ దాదాపు 5 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం తక్కువగా ఉండటంతో.. కేవలం 12 నిమిషాల్లోనే సీఎం తన ప్రసంగాన్ని ముగించి అక్కడి నుంచి బయలుదేరారు.

First Published:  6 Nov 2023 4:47 PM IST
Next Story