కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు.. సిగ్గు, మానం ఉందా..?
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండని తిరుగుతున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు సిగ్గు మానం ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు కేసీఆర్.
ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ నేతలు చేయని లాలూచీ పనులు లేవని మండిపడ్డారు సీఎం కేసీఆర్. అడ్డమైన కుట్రలన్నీ చేస్తున్నారని ఆరోపించారు. లంగ మాటలు మాట్లాడుతూ, లంగ పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. యాసంగికి రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతుబంధు జమ కాకుండా కాంగ్రెస్ నేతలే అడ్డుపడ్డారని చెప్పారు కేసీఆర్. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి మరీ ఆపివేయించారన్నారు. చివరకు ఈసీ అనుమతిచ్చినా, మళ్లీ ఫిర్యాదు చేశారని, రైతుబంధుని మళ్లీ ఆపింది కాంగ్రెస్ నాయకులేనని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ కి ఓటు వేయాలా అని షాద్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి ఈ సారి భారీ మెజార్టీ రావాలని ఆకాంక్షించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండని తిరుగుతున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు సిగ్గు మానం ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో చాలామంది రైతుబంధు తీసుకునేవాళ్లు ఉన్నారని చెప్పారు. వారి ఖాతాల్లో పడాల్సిన రైతుబంధును పడకుండా అడ్డుకున్న కాంగ్రెస్ కి వారు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి కాంగ్రెస్ కు మద్దతిస్తే మీ కొంప కొల్లేరవుతుందన్నారు. ఈ విషయంపై ప్రజలు బాగా ఆలోచించాలని, కాంగ్రెస్ కుట్రలను గుర్తెరిగి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ వెనకటి దరిద్రపు రోజులే వస్తాయని హెచ్చరించారు కేసీఆర్.
షాద్ నగర్ కు మెట్రో..
షాద్ నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత తనదేనని చెప్పారు సీఎం కేసీఆర్. ఇక్కడి వరకు మెట్రో వస్తే భూముల ధరలు మూడింతలు పెరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వజ్రం తునక లాంటి మనిషి అని.. ఆయన చీమకు దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదని ప్రశంసించారు. అలాంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువగా ఉంటారని.. మొదట్నుంచి ఆయన తనకు నమ్మిన బంటు అన్నారు. అంజయ్య లాంటి ఎమ్మెల్యే ఉంటే షాద్ నగర్ కు ఏదంటే అది వస్తుందన్నారు కేసీఆర్.
♦