Telugu Global
Telangana

నేటినుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం..

ఈ మూడు రోజుల్లో తెలంగాణలో కీలక పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ డిక్లరేషన్లు విడుదల చేసింది, ఎస్సీ వర్గీకరణకు సై అని మోదీ హైదరాబాద్ వేదికగా ప్రకటించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. వీటన్నిటిపై సీఎం కేసీఆర్ స్పందించే అవకాశాలున్నాయి.

నేటినుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం..
X

మూడు రోజుల గ్యాప్ తర్వాత సీఎం కేసీఆర్‌ తన రెండో విడత ప్రచారాన్ని ఈరోజునుంచి మొదలు పెడుతున్నారు. ఈరోజు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం పర్యటిస్తారు. దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఈనెల 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేసిన అనంతరం కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగించారు కేసీఆర్. ఆ తర్వాత మూడు రోజులపాటు సభలకు విరామం ఇచ్చి సమీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్షల అనంతరం ఈరోజు ఆయన మలిదశ ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు.

ఈ మూడు రోజుల్లో తెలంగాణలో కీలక పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ డిక్లరేషన్లు విడుదల చేసింది, ఎస్సీ వర్గీకరణకు సై అని మోదీ హైదరాబాద్ వేదికగా ప్రకటించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. కొన్నిచేరికలు కూడా జరిగాయి. వీటన్నిటిపై సీఎం కేసీఆర్ స్పందించే అవకాశాలున్నాయి. ఈరోజు ప్రసంగాలు మరింత వాడివేడిగా ఉంటాయని అంచనా.

రెండో దశ ప్రచారం ఇలా..

నవంబర్ 13 - దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట

నవంబర్ 14 - పాలకుర్తి, నాగార్జునసాగర్(హాలియా), ఇబ్రహీంపట్నం

నవంబర్ 15 - బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్

నవంబర్ 16 - ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్

నవంబర్ 17 - కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల

నవంబర్ 18 - జనగాంలో రోడ్డుషో

నవంబర్ 19 - ఆలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి

నవంబర్ 20 - మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్లగొండ

నవంబర్ 21 - మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట

నవంబర్ 22 - తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి

నవంబర్ 23 - మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు

నవంబర్ 24 - మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి

నవంబర్ 25 - హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్

నవంబర్ 26 - ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక

నవంబర్ 27 - షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి

నవంబర్ 28 - వరంగల్ (ఈస్ట్, వెస్ట్), గజ్వేల్‌

తొలిదశ ప్రచారాన్ని కామారెడ్డితో ముగించిన కేసీఆర్, మలిదశ ప్రచారాన్ని గజ్వేల్ తో ముగిస్తారు. ఈరోజుతో మొదలై, ఈ నెల 28వ తేదీ వరకు 54 సభల్లో ఆయన పాల్గొంటారు.

First Published:  13 Nov 2023 8:08 AM IST
Next Story