Telugu Global
Telangana

నేటి నుంచి KCR రాజశ్యామల యాగం.. ప్రచారానికి బ్రేక్.!

సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ చేసి యాగం ప్రవేశం చేస్తారు. రెండో రోజు రుత్వికుల పారాయణం, జపాలు, హోమాలు నిర్వహిస్తారు. ఇక మూడో రోజున పూర్ణాహుతి కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.

నేటి నుంచి KCR రాజశ్యామల యాగం.. ప్రచారానికి బ్రేక్.!
X

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. సీఎం కేసీఆర్‌ మరోసారి యాగానికి సిద్ధమయ్యారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి వ్యవసాయం క్షేత్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షణలో ఈ యాగం ప్రారంభం కానుంది.

ఇవాళ సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ చేసి యాగం ప్రవేశం చేస్తారు. రెండో రోజు రుత్వికుల పారాయణం, జపాలు, హోమాలు నిర్వహిస్తారు. ఇక మూడో రోజున పూర్ణాహుతి కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. ఇక..శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో శత చండీ యాగం సైతం నిర్వహిస్తారని తెలుస్తోంది. శృంగేరీ పండితులు గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ ఈ యాగం నిర్వహించనున్నారు. రెండు యాగాల నిర్వహణకు సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ హోమాల్లో కర్ణాటక, ఏపీ, తెలంగాణకు చెందిన 200 మంది రుత్వికులు పాల్గొంటారని సమాచారం.

2018 ఎన్నికలకు ముందు సైతం కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. మరోవైపు ఇవాళ సత్తుపల్లి, ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే యాగం నేపథ్యంలో సభలకు హాజరవుతారా.. లేదా బ్రేక్ ఇస్తారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

First Published:  1 Nov 2023 2:32 AM GMT
Next Story