అలుపెరుగని కేసీఆర్.. ఇవాళ మరో నాలుగు సభలు
ఈనెల 28తో ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో అందుకు అనుగుణంగా మిగతా నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ సభలకు ప్లాన్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల గడువు ఉంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే 86 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు హాజరైన కేసీఆర్.. ఇవాళ మరో నాలుగు సభలకు హాజరుకానున్నారు.
ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, జగిత్యాలతో పాటు దుబ్బాక నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరవుతారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.
ఈనెల 28తో ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో అందుకు అనుగుణంగా మిగతా నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ సభలకు ప్లాన్ చేశారు. సోమవారం షాద్‌నగర్, చేవెళ్ల, ఆందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు కేసీఆర్. ఇక ప్రచారానికి చివరి రోజైన మంగళవారం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు కలిపి ఒకే చోట సభలు నిర్వహించనున్నారు. తర్వాత గజ్వేల్‌లో నిర్వహించే సభతో సీఎం కేసీఆర్ ప్రచారం ముగియనుంది.