Telugu Global
Telangana

వాళ్లు వచ్చేది లేదు సచ్చేది లేదు..

రేవంత్ రెడ్డికి తెలివి లేదని, అవగాహన లేదని మండిపడ్డారు సీఎం కేసీఆర్. రైతుబంధు పేరుతో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, వారికి అసలు అవగాహనే లేదని చెప్పారు.

వాళ్లు వచ్చేది లేదు సచ్చేది లేదు..
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని, వారు వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ.. ధరణి లేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పారు సీఎం కేసీఆర్. రైతుల పట్ల బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తామంటోందని, అదే లేకపోతే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. మళ్లీ పైరవీలు, దళారీల రాజ్యం రావాలని వారు కోరుకుంటున్నారా అని అడిగారు. దమ్మపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


రేవంత్ రెడ్డికి తెలివి ఉందా..?

రేవంత్ రెడ్డికి తెలివి లేదని, అవగాహన లేదని మండిపడ్డారు సీఎం కేసీఆర్. రైతుబంధు పేరుతో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, వారికి అసలు అవగాహనే లేదని చెప్పారు. కరెంటు 24 గంటలు వేస్ట్ అంటున్నారని, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారని.. ఏ పార్టీ వైఖరి ఏంటో ప్రజలు గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలివ్వడంతోపాటు, వారికి కూడా రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నామని చెప్పారు కేసీఆర్.

దమ్మపేట సభలో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు వెంకటేశ్వర్లు. సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ విజయానికి తన వంతు బాధ్యతగా పని చేస్తానని చెప్పారు.

First Published:  13 Nov 2023 3:32 PM IST
Next Story